నాచగిరిలో నేత్రపర్వంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
గరుడ వాహనంపై
లక్ష్మీనృసింహస్వామివారు
వర్గల్(గజ్వేల్): నాచగిరి క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వం చేస్తున్నాయి. మంగళవారం రాత్రి స్వామివారి పెద్దగరుడ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 10 గంటలకు గరుడోత్సవం ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగింది. ఆలయ ఈఓ విశ్వనాథశర్మ పర్యవేక్షణలో అర్చక పరివారం గరుడాళ్వారు(గరుత్మంతుడు)ను పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలమాలికలతో అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం లక్ష్మీసమేత స్వామివారు గరుడ వాహనం అధిష్టించి పురవీథులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.