మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక
వర్గల్(గజ్వేల్): నాచగిరి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మాజీ సీఎం కేసీఆర్‌కు మంగళవారం నాచగిరి ఆలయ ఈఓ విశ్వనాథ శర్మ ఆహ్వాన పత్రిక అందజేశారు. వేదపండితుల మహదాశీర్వచనం అనంతరం ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు. ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.
మంత్రి కొండా సురేఖకు..
రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖను నాచగిరి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వా నిస్తూ డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డితో కలిసి ఆలయ ఈఓ ఉత్సవ ఆహ్వాన పత్రిక అందజేశారు. దపండితులు మంత్రికి మహదాశీర్వచనం చేసి, ప్రసాదం అందజేశారు.
పరీక్షలంటే భయం వద్దు
దుబ్బాకటౌన్: పదోతరగతి విద్యార్థులు ఎటువంటి భయం లేకుండా, ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలంగాణ మోడల్ స్కూల్ డిప్యూటీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ సూచించారు. మండంలోని లచ్చపేట మోడల్ స్కూల్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో పలు రికార్డులను తనిఖీ చేసి, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయకుండా పరీక్షలపై దృష్టి సారించాలన్నారు. ఇటీవల సైన్స్ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న విద్యార్థి హర్షవర్ధన్‌ను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బుచ్చిబాబు, ఉపాధ్యాయులు ఉన్నారు.
హాస్టల్ వెల్ఫేర్ అధికారిగా బెజ్జంకి యువకుడు
బెజ్జంకి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వెలువరిచిన హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకాలకు బెజ్జంకి యువకుడు జడల చంద్రశేఖర్ ఎంపికయ్యారు. టీపీఎస్‌పీ నిర్వహించిన పరీక్షలలో రాష్ట్రస్థాయిలో 184వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 24వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనను గ్రామస్తులు, యువకులు అభినందించారు.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాధిక
చిన్నకోడూరు(సిద్దిపేట): ఎరువులను అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాధిక హెచ్చరించారు. స్థానిక ఎరువుల దుకాణాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని, కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. అనంతరం పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆమె వెంట మండల వ్యవసాయశాఖ అధికారి జయంత్ కుమార్, ఏఈఓలు ఉన్నారు.
12 మంది డిబార్
కోహెడ(హుస్నాబాద్): ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమైన పదిరోజులలో జిల్లా వ్యాప్తంగా 12 మంది విద్యార్థులు డిబార్ అయ్యారని డీఐఈఓ రవీందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలో భాగంగా ఐదుగురు విద్యార్థులు కాఫీ కొడుతూ పట్టుబడినట్లు చెప్పారు.
మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక
మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక
మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక
మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక
Comments
Please login to add a commentAdd a comment