అంకిరెడ్డిపల్లి వాసికి డాక్టరేట్‌ పట్టా | - | Sakshi
Sakshi News home page

అంకిరెడ్డిపల్లి వాసికి డాక్టరేట్‌ పట్టా

Apr 6 2025 6:55 AM | Updated on Apr 6 2025 6:55 AM

అంకిర

అంకిరెడ్డిపల్లి వాసికి డాక్టరేట్‌ పట్టా

కొండపాక(గజ్వేల్‌): మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లికి చెందిన తోట శారద పేదరికం, అంగవైకల్యాన్ని జయించి కాకతీయ యూనివర్సిటీలో డాక్టరేట్‌ పట్టానందుకున్నారు. ఆమెది పేద కుటుంబం. ఐత చంద్రయ్య సాహిత్యం సమగ్ర పరిశీలన అంశంపై యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసింది. శారీరక అంగవైకల్యం ఉన్నప్పటికీ డాక్టరేట్‌ను సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లి పట్టాను దక్కించుకుంది. దీంతో గ్రామస్తులు శారదకు అభినందించారు.

శ్రీరామనవమికి

నాచగిరి సిద్ధం

నేడు సీతారాముల కల్యాణం

వర్గల్‌(గజ్వేల్‌): సుప్రసిద్ధమైన నాచగిరి క్షేత్రంలోని శ్రీరామాలయం శ్రీరామనవమి మహోత్సవానికి ముస్తాబైంది. శ్రీలక్ష్మీ నృసింహుని గర్భగుడి చెంతనే గుహలో శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తి, ఆ పక్కనే ఆంజనేయ స్వామి కొలువుదీరారు. ఆదివారం శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో విశాలమైన కల్యాణ వేదికను సిద్ధం చేశారు. ఉదయం 10.30 గంటలకు జగదభిరాముని కల్యాణోత్సవం జరుగుతుంది. భక్తజనులు కల్యాణ మహోత్సవ వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించాలని ఆలయ ఈఓ విశ్వనాథశర్మ కోరారు.

కొమురవెల్లి ఈవోగా

అన్నపూర్ణ నియామకం

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ నూతన ఈవోగా అన్నపూర్ణను నియమించారు. ఈ మేరకు దేవాదాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న అన్నపూర్ణకు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆలయ ఈవోగా పని చేస్తున్న రామాంజనేయులును దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. సోమవారం అన్నపూర్ణ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

కొత్త పెన్షన్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం: చంద్రారెడ్డి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): కొత్త పెన్షన్‌ సవరణ బిల్లును తీసుకురావడంతో ప్రస్తుత పెన్షనర్ల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని, అందువల్ల కొత్త పెన్షన్‌ సవరణ బిల్లును వ్యతిరేకిద్దామని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త సవరణతో భవిష్యత్‌లో పాత పెన్షన్‌ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులను రెండుగా విభజించనున్నట్లు తెలిపారు. దీంతో పెన్షన్‌దారులకు ఇబ్బందులు ఉంటాయన్నారు. కేంద్రం వెంటనే కొత్త పెన్షన్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

మద్దతు ధర కల్పించాలి

హుస్నాబాద్‌రూరల్‌: వడ్లకు ప్రభుత్వ మద్ధతు ధర చెల్లించాలని రైతులు శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. హుస్నాబాద్‌లో వ్యాపారులు రైతుల నుంచి పచ్చి వడ్లను కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు రూ.1,900లు చెల్లిస్తామని చెప్పిన వ్యాపారులు తూకం వేసిన తర్వాత రూ.1760లు చెల్లించడంతో రైతులు గోమాత మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. మద్ధతు ధర రూ.2,330లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజల అభ్యున్నతే ధ్యేయం

గజ్వేల్‌రూరల్‌: అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ పాలన సాగిస్తున్నదని ఏఎంసీ చైర్మన్‌ వంటేరు నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని శ్రీగిరిపల్లిలో సన్నబియ్యం పంపిణీని శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్‌, గణేశ్‌, కరుణాకర్‌, మహేశ్‌, నర్సిహులు, సురేశ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

అంకిరెడ్డిపల్లి వాసికి డాక్టరేట్‌ పట్టా1
1/1

అంకిరెడ్డిపల్లి వాసికి డాక్టరేట్‌ పట్టా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement