ఆర్థిక అక్షరాస్యతతోనే అభివృద్ధి
కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఉంటే అది వారి స్వయం అభివృద్ధితోపాటు దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల కామర్స్ విభాగాధిపతి డాక్టర్ గోపాల సుదర్శనం రచించిన ‘ఆర్థిక అక్షరాస్యత’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కళాశాలలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయ వనరులు పెరిగినా, సరైన ఆర్థిక పరిజ్ఞానం లేక వెనుకబడుతున్నారన్నారు. ఆర్థిక సంస్థల విధి విధానాలు, పన్నులు, వాటి మదింపు పద్ధతులు, పొదుపు, పెట్టుబడి తదితర అంశాల గురించి రచయిత ఈ పుస్తకంలో వివరించారని ప్రశంసించారు. అధ్యాపకులు విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను, పొదుపు ప్రాధాన్యాన్ని బోధించాలని సూచించారు. అనంతరం పుస్తక రచయిత డాక్టర్ గోపాల సుదర్శనం మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతలో వెనుకబడిన వారు వ్యాపారాల్లో దివాలాతీసి, అప్పులుచేసి కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అందుకే సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళిక, భద్రత గురించి ఈ పుస్తకంలో వివరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.సునీత, రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యరెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ మధుసూదన్, ఇంగ్లిష్ విభాగాధిపతి మామిడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment