
అర్జీలను సత్వరం పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
సిద్దిపేటరూరల్: ప్రజలు అందజేసిన అర్జీలను సత్వర పరిష్కరించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి గరిమా అగర్వాల్ దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అర్జీలు అందిస్తున్న బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్ల, వివిధ సమస్యలపై మొత్తంగా 59 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో
అలసత్వం తగదు
మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి
దుబ్బాక: ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం తగదని, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్ పాతూరి శ్రీనివాస్‌రెడ్డి నిర్వాహకులకు సూచించారు. సోమవారం మున్సిపల్ పరధిలోని చెల్లాపూర్ 2, 3 వార్డులలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ, తూకం విషయంలో ఏ మాత్రం పొరపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. మండుతున్న ఎండలతో పాటు అకాల వర్షాలు కురుస్తున్నందునా కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఇంటి పన్ను చెల్లించే వారికి అందించే ఎర్లీబర్డ్ పథకం మరో రెండు రోజుల్లో ముగుస్తుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెప్మా సీఈఓ సరిత, ఆర్పీలు, రైతులు తదితరులు ఉన్నారు.
చేర్యాల మహిళకు
సీ్త్ర శక్తి అవార్డు
చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రానికి చెందిన పి.మంగ రాష్ట్ర స్థాయి సీ్త్ర శక్తి అవార్డు అందుకున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా డీఆర్డీఓ సిద్దిపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల ఆధ్వర్యంలో అవార్డులు వరించాయి. జిల్లా తరఫున చేర్యాలకు చెందిన నకాషి కళాకారిని పి.మంగ రూపొందించిన చేర్యాల మాస్క్ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డును మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో డీపీఎం కరుణాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

అర్జీలను సత్వరం పరిష్కరించాలి