లక్ష్యంతో చదివితేనే ఉన్నత స్థాయికి..
మిరుదొడ్డి(దుబ్బాక): ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో చదివితేనే ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకుంటారని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. సంకల్ప్ సేవా ఫౌండేషన్, ఎస్‌ఆర్‌కే ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం మిరుదొడ్డి మండల పరిధిలో టెన్త్ విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అత్యున్నతమైన గౌరవం, విలువ లభించాలంటే చదువొక్కటే మార్గమన్నారు. అనుకున్నది సాధించాలంటే పట్టుదలతో చదివి మంచి ఫలితాలను సాధించాలన్నారు.
ఉపాధ్యాయులపై అసహనం ..
ఎగ్జామినేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో దేశ రాష్ట్రపతి ఎవరు అన్న ప్రశ్నకు విద్యార్థులు సరైన సమాధానం చెప్పకపోవడంతో మెదక్ ఎంపీ విస్మయం వ్యక్తం చేశారు. దేశ ప్రథమ పౌరురాలు ఎవరో తెలియని విద్యార్థులకు ఏం విద్యాబోధన చేస్తున్నారని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రతి పాఠశాలలో ప్రధాని, రాష్ట్రపతి, రాష్ట్ర సీఎం ఫొటోలను ఏర్పాటు చేయాలని ఎంఈఓ ప్రవీణ్ బాబును ఆదేశించారు. ఇదిలా ఉండగా ఎంపీగా గెలుపొందింన తర్వాత తొలి సారిగా మిరుదొడ్డి మండల కేంద్రానికి వచ్చిన మెదక్ ఎంపీ మాధ వనేని రఘునందన్ రావుకు పలువురు రైతులు, అంగన్‌వాడీ టీచర్లు వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించంచేందుకు కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌కే వ్యవస్థాపకుడు శివరామ కృష్ణ, దక్షిణ మధ్య ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగం, ఎంఈఓ ప్రవీణ్ బాబు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్ రావు
Comments
Please login to add a commentAdd a comment