నాణ్యత కొరవడి
పనులు హడావుడి..
అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడుతోంది. గడువు ముంచుకొస్తుండటం.. పనులు హడావుడిగా చేపడుతుండటం.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించేందుకు ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా రూ.74.92కోట్లతో 766 సీసీ రోడ్లను మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ.33కోట్లతో పలుచోట్ల నిర్మాణాలు పూర్తికాగా.. నిర్మించిన ఏడు రోజులకే పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. మరోవైపు ఈ నెలాఖరులోగా మిగతా రోడ్ల నిర్మాణం పూర్తి కాకపోతే నిధులు రద్దవుతాయి. పనులు జరుగుతున్న తీరుపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక విషయాలు వెలుగుచూశాయి.
Comments
Please login to add a commentAdd a comment