
దళితులంటే బీఆర్‌ఎస్ నేతలకు చిన్నచూపు
● డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఫైర్ ● గజ్వేల్‌లో కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డిలదిష్టిబొమ్మలు దహనం
గజ్వేల్: దళితులంటే బీఆర్‌ఎస్ నేతలకు చిన్నచూపు అని, ప్రజలు బుద్ధి చెప్పినా, అధికారం కోల్పోయినా వారిలో మార్పు రావడం లేదని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. స్పీకర్‌పై జగదీశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులంటే బీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి చిన్నచూపు ఉందని ఆరోపించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి అగౌరవపరిచే విధంగా మాట్లాడడం తగదన్నారు. జగదీశ్వర్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి, మాజీ కార్పోరేషన్ చైర్మన్ భూంరెడ్డి, యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సర్ధార్‌ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీపీసీసీ నాయకులు సాజిద్‌బేగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment