
గ్యాస్ ధరలు తగ్గించాల్సిందే
గజ్వేల్: గ్యాస్ ధరలు తగ్గించేవరకు పోరాటం కొనసాగిస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి హెచ్చరించారు. గురువారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టానుసారంగా గ్యాస్ ధరలను పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డి విర్తుస్తోందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఒక్కో సిలిండర్‌పై రూ.50 ధరను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ శాఖ అధ్యక్షులు అజహర్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మండల నాయకుడు అభిలాష్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు సమీర్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
గజ్వేల్‌లో ర్యాలీ, ప్రధాని దిష్టిబొమ్మ దహనం