మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధి పనుల్లో కొరవడిన నాణ్యతపై అధికారులు స్పందించారు. సీసీ రోడ్ల పనుల్లో నాణ్యత కొరవడుతోందంటూ ఈ నెల 24న ‘సాక్షి’లో వచ్చిన ‘పనులు హడావిడి.. నాణ్యత కొరవడి’ అన్న పరిశీలనాత్మక కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో నిర్మించిన సీసీ రోడ్డుకు వాటర్ క్యూరింగ్ చేయాల్సిందిగా అధికారులు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల నుంచి వాటర్ క్యూరింగ్ లేని సీసీ రోడ్డుపై గడ్డిని పరిచి వాటర్ క్యూరింగ్‌కు చర్యలు చేపట్టారు.
నేటి నుంచి మూడో విడత మూల్యాంకనం
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూడో విడత మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ అధ్యాపకులు మూల్యాంకన కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాలని తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్ అధ్యాపకులను రిలీవ్ చేయాలని సూచించారు.
రేవంత్‌రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం
చేర్యాల(సిద్దిపేట): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి ప్రజలు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. కమలాయపల్లి, అర్జునపట్ల గ్రామాలను మద్దూరు మండలం నుంచి చేర్యాల మండలంలోకి కలుపుతూ గెజిట్ విడుదల చేసిన సందర్భంగా మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, జనగామ నియోజకవర్గఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చిత్రపటాలకు కమలాయపల్లి గ్రామస్తులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ గ్రామాలను చేర్యాల మండలంలో పూర్తి స్థాయిలో కలిపేందుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సీఎంపై విమర్శలు తగవు
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించడం తగదని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్‌పై సీఎం సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. గజ్వేల్ ప్రజలకు హరీశ్‌రావు 24గంటలూ అందుబాటులో ఉండి అభివృద్ధిని పరుగులెత్తిస్తారని గతంలో కేసీఆర్ చెప్పినా హరీశ్‌రావు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. సిద్దిపేటలో వేగంగా అభివృద్ధి పనులు పూర్తయితే గజ్వేల్‌లో మాత్రం పెండింగ్‌లో పడ్డాయన్నారు. ఇందుకు హరీశ్‌రావే కారణమని ఆరోపించారు.
సీల్డ్ టెండర్ల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని 27 పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేయడానికి సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెండర్ ఫారం ధర రూ.2000, ఈఎండీ ధర రూ.50వేలు ఉంటుందన్నారు. టెండర్ ఫారాలు ఈ నెల 28 వరకు విద్యాశాఖ కార్యాలయంలో పొందాలన్నారు. పూర్తి చేసిన ఫారాలను బాక్స్‌లో వేయాలన్నారు. సీల్డ్ టెండర్లను ఈ నెల 29న ఉదయం 11గంటలకు జేపీసీ కమిటీ ఆధ్వర్యంలో తెరుస్తామని తెలిపారు.
వాటర్ క్యూరింగ్‌కు చర్యలు
వాటర్ క్యూరింగ్‌కు చర్యలు
వాటర్ క్యూరింగ్‌కు చర్యలు