
హెచ్‌సీయూ భూములు కాపాడండి
సీపీఎం జిల్లా నేత వెంకట్‌మావో
చేర్యాల(సిద్దిపేట)/బెజ్జంకి(సిద్దిపేట)/మద్దూరు(హుస్నాబాద్): హెచ్‌సీయూ భూములను కాపాడాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట్‌మావో పిలుపునిచ్చారు. యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన నిరసన కార్యక్రమాల సందర్భంగా మంగళవారం పలువురు ఎస్‌ఎఫ్‌ఐ, సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. యూనివర్సిటీ భూములను అమ్ముకొనే చర్యను వెంటనే మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో నాగరాజు, శ్రీహరి, ప్రభాకర్, మల్లేశం, కుమార్ తదితరులున్నారు. అదే విధంగా బెజ్జంకిలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి సాయికృష్ణ, అధ్యక్షుడు మహేశ్‌ను అరెస్టు చేశారు. మద్దూరు, దూల్మిట్ట మండలాల సీపీఎం కార్యదర్శులు ఎండీ షఫీ, రాజును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
పోలీసుల అదుపులో సీపీఎం నాయకులు