
నిర్లక్ష్యం వహించే వైద్య సిబ్బందిపై చర్యలేవీ?
సీపీఎం జిల్లా నేత ఎల్లయ్య
గజ్వేల్‌రూరల్: నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎల్లయ్య మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వాసుపత్రిలో ఆర్‌ఎంఓ డాక్టర్ రాముకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలు దాటినా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చికిత్స కోసం వచ్చేవారికి వైద్యం అందించకుండా ఫోన్‌లు చూస్తూ కాలయాపన చేస్తున్నారని, దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరిస్తున్నారన్నారు. సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రంగారెడ్డి తదితరులున్నారు.