అన్ని వర్గాలకూ అన్యాయం
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు అన్యాయం చేసేవిధంగా ఉంది. వ్యవసాయం, విద్య, సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరోమారు మోసం చేసేవిధంగానే బడ్జెట్‌ను రూపొందించారు.
పేదల సంక్షేమానికి పెద్దపీట
డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్: తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రూ.56,084 కోట్లను కేటాయించారు. రైతు సంక్షేమం, నీటిపారుదల తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యంలేదు
మంద పవన్, సీపీఐ జిల్లా కార్యదర్శి
బడ్జెట్‌లో విద్యకు 7.57 శాతం, వైద్యానికి 6 శాతం నిధులు కేటాయించారు. దీని వల్ల ఆ రెండు రంగాలు అభివృద్ధి చెందే అవకాశం లేదు. నీటి పారుదులకు రూ.23,373 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.5,907 కోట్లు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది.
హామీలకు, బడ్జెట్‌కు పొంతన లేదు
మల్లారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
సిద్దిపేటఅర్బన్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పొంతన లేదు. ఈ యేడాది కూడా హామీలను అమలుచేసే పరి స్థితి కనిపించడంలేదు. వెనక్కి తీసుకొని ప్రజా సంక్షేమ బడ్జెట్‌ను రూపొందించాలి.
అన్ని వర్గాలకూ అన్యాయం
అన్ని వర్గాలకూ అన్యాయం
Comments
Please login to add a commentAdd a comment