
పోషకాహారలోపాన్ని నివారించాలి
డీప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్
గజ్వేల్: మహిళలు, చిన్నారుల్లో పోషకాహారలోపాన్ని సరిచేయడానికి కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రాజెక్ట్ స్థాయి పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. హాజరైన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ గ్రామాల్లో ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు సమన్వయంతో పనిచేసి పోషకాహారలోపం తలెత్తకుండా చూడాలన్నారు. పోషణ పక్వాడలో భాగంగా మొదటి వెయ్యి రోజులు గర్భిణులు, పిల్లలకు క్రమపద్ధతిలో పోషకాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ సరిత, తహసీల్దార్ శ్రావన్‌కుమార్, వైద్యాధికారులు బల్బీర్‌సింగ్, ప్రణయ్, సత్యప్రకాశ్, పోషణ అభియాన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ కిరణ్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు భవానీ, శ్రీలక్ష్మీ, రజిత, అనురాధ, దెబోర రాణి, రాణి, సునీత తదితరులు పాల్గొన్నారు.
కల్యాణం.. కమనీయం
గజ్వేల్‌రూరల్: పట్టణంలోని అతి పురాతనమైన సీతారామ ఉమామహేశ్వరాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. మంగళవారం రాత్రి స్వామివార్ల ఎదుర్కోలు కార్యక్రమాన్ని మంగళవాయిద్యాల నడుమ నిర్వహించి, పట్టణ పుర వీధుల గుండా మంటపం వరకు విగ్రహాలను తీసుకువచ్చారు. అనంతరం వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో
అభివృద్ధి శూన్యం
ములుగు(గజ్వేల్): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలే తప్ప అభివృద్ధి లేదని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ములుగులోని కేఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తెలంగాణను సాధించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే హామీలను తుంగలో తొక్కి, ఆరు గ్యారంటీలను విస్మరించిందన్నారు. అనంతరం వారు నాయకులు, కార్యకర్తలతో కలసి సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
యువత భాగస్వాములు కావాలి
గజ్వేల్‌రూరల్: దేశ రక్షణలో యువత భాగస్వాములు కావాలని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి అన్నారు. గజ్వేల్‌లోని ఆజాద్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఆర్మీ జవాన్‌గా ఎంపికై న వరుణ్‌ను మంగళవారం ఏసీపీ పురుషోత్తంరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మీలో చేరి దేశ ప్రజలకు సేవలందించే సైనికుల సేవలు వెలకట్టలేనివని, యువత దేశ రక్షణలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తున్న ఆజాద్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

పోషకాహారలోపాన్ని నివారించాలి

పోషకాహారలోపాన్ని నివారించాలి

పోషకాహారలోపాన్ని నివారించాలి