జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన దుబ్బాక పశువుల సంత, కూరగాయల సంతల్లో కనీస సౌకర్యాలు లేవు. ప్రతి శనివారం తెలంగాణ తల్లి చౌరస్తాలో రోడ్డుపైనే కూరగాయల సంత నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దుంపలపల్లి రోడ్డులో ఎలాంటి వసతులు లేకపోవడంతో ఎర్రటి ఎండలోనే పశువుల సంత కొనసాగుతోంది.
సుందరీకరణ తూచ్..
రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పార్కులు, జిమ్‌లు, చౌరస్తాల ఆధునీకరణ, చెరువు కట్టల సుందరీకరణ ముందుకు సాగడంలేదు. చెరువుకట్టపై ఏర్పాటు చేసిన జీమ్ పరికరాలు ధ్వంసమైనా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇక తెలంగాణ తల్లి చౌరస్తా, ఛత్రపతి శివాజీ చౌరస్తాలు సైతం అధికారుల పర్యవేక్షణ లోపించడంతో బోసిపోయి కనిపిస్తున్నాయి.