
ఆధ్యాత్మికతతోనే గుణాత్మక మార్పు
●
వారి అకౌంట్లలోనే జమ
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలుగా పదవీ విరమణ పొందిన వారి వివరాలను పంపించాం. వారికే నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులు జమ కానున్నాయి.
–లక్ష్మీకాంతరెడ్డి, డీడబ్ల్యూఓ
సిద్దిపేటజోన్: ఆధ్యాత్మికతతోనే మనుషుల్లో గుణాత్మక మార్పు సాధ్యమని, ఆదిశగా ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి స్థానిక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మాబాట్ల నర్సింహాశర్మ పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి వచ్చిన వారిని ఉద్దేశించి హరీశ్‌రావు మాట్లాడారు. మనిషి సత్ మార్గంలో పయనించాలని, అందుకు ఆధ్యాత్మికత అవసరమన్నారు. రేపటి తరానికి సంస్కృతి నేర్పిద్దామన్నారు. విదేశాల్లో పండుగలు, దేవాలయాలు, పూజలు చేస్తూ మన సంస్కృతి కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సమాజాన్ని నడిపించే బాధ్యత అందరిపై ఉందన్నారు. కోమటి చెరువు వద్ద టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. అనంతరం పలువురు కవులను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ రోజాశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, పరిషత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మ దేవాలయంలో పూజలు
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని కొండెంగలకుంటలో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
రేపటి తరాలకు సంస్కృతిని నేర్పిద్దాం
ఎమ్మెల్యే హరీశ్ రావు

ఆధ్యాత్మికతతోనే గుణాత్మక మార్పు