మహారాష్ట్ర, కర్ణాటకల్లో వైన్ టూరిజం..
ప్రస్తుతం మన రాష్ట్ర అవసరాలకు మహారాష్ట్ర నుంచి ద్రాక్షను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వం రైతులకు విరివిగా సబ్సిడీలను అందిస్తుండటంతో సాగు క్రమంగా పెరుగుతోంది. మరో ముఖ్యమైన అంశమేమిటంటే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ‘వైన్ టూరిజం’ ట్రెండ్ కొనసాగుతోంది. ద్రాక్ష తోటలు సాగుచేస్తున్న రైతులు.. తమ తోటలను ‘ఎకో టూరిజం’ ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. తోటల్లో ఎక్కువగా వైన్ వైరెటీగా చెప్పుకునే రేసిన్ రకం ద్రాక్షను సాగు చేస్తున్నారు. అంతేకాకుండా తోటల్లోనే వైన్ ఉత్పత్తి యూనిట్లను సైతం ఏర్పాటుచేసి.. తమ తోటల్లో వచ్చే పర్యాటకులకు తక్కువ ధరకు వైన్ అందిస్తున్నారు. ప్రస్తుతం లిక్కర్‌కు వైన్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. లిక్కర్‌లో అల్కాహాల్ శాతం 46శాతం వరకు ఉంటే వైన్‌లో కేవలం 8–10శాతం అల్కాహాల్ ఉండటం వల్ల ప్రత్యేకించి యువతతోపాటు అన్ని వయసుల వారు వైన్ సేవించడానికి మక్కువ చూపుతున్నారు. తమ కళ్లముంగిటే సహజమైన పద్ధతుల్లో వైన్ దొరుకుతుండటంతో దీనిని ఇష్టంగా సేవిస్తున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటకల్లో వైన్ టూరిజం..
మహారాష్ట్ర, కర్ణాటకల్లో వైన్ టూరిజం..


