
వైద్య సేవలపై నిర్లక్ష్యం తగదు
సిద్దిపేటకమాన్: వైద్య సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌ఓ పల్వన్‌కుమార్ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వైద్యాధికారులు, సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం మన హక్కుగా సిబ్బంది భావించి వైద్య సేవలు అందించాలన్నారు. మాతా, శిశు మరణాలు జరగకుండా వ్యాధి నిరోధక టీకాలు సమయానికి అందించాలన్నారు. గర్బిణులకు, చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఎల్లవేళలా
అందుబాటులో ఉండాలి
డీఎంహెచ్‌ఓ పల్వన్‌కుమార్