
ఇళ్ల పనులు వేగిరం చేయండి
బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని తక్షణం అరికట్టాలి
కొమురవెల్లి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. మంగళవారం మండలంలోని కేజీబీవీ పాఠశాలతో పాటు పోసాన్‌పల్లిలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల్లో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని లబ్ధిదారులకు సూచించారు. అదే విధంగా ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుకను వెంటనే అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పనులు వేగవంతమైతే బిల్లులు వెంటనే చెల్లిస్తామని లబ్ధిదారుకుల భరోసా ఇచ్చారు. అంతకు ముందు కేజీబీవీ పాఠశాల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆడపిల్లలు అన్నిరంగాల్లో ముందు ఉండాలని అన్నారు. అనంతరం పోసాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడంతో పాటు రైతులకు ధాన్యం విక్రయించే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దివ్య, ఎంపీడీఓ శ్రీనివాస వర్మ, హౌసింగ్ పీడీ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటరూరల్: తొగుట మండలం కాన్గల్ గ్రామంలో బర్డ్‌ఫ్లూతో 15వేల కోళ్లు మృత్యువాత పడటంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అత్యవసర సమావేశమయ్యారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయిన క్రమంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, మనుషులకు సోకకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ సోకిన కోళ్లను శాసీ్త్రయ పద్ధతిలో భూమిలో పూడ్చి వేయాలన్నారు. ఫారంలో పనిచేసే సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, కిలోమీటరు లోపు కోడిగుడ్లు అమ్మకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అశోక్‌కుమార్, డీఎంహెచ్‌ఓ పల్వాన్‌కుమార్, సీఐ మల్లేశ్‌గౌడ్, డీపీఆర్‌ఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
కోళ్ల మృత్యువాతపై అదనపు కలెక్టర్ అత్యవసర సమావేశం
అధికారులకు దిశా నిర్దేశం

ఇళ్ల పనులు వేగిరం చేయండి