కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా అన్నపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామాంజనేయులును దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాస్థానం అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణకు మల్లన్న ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమె సోమవారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్‌రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు బందారం కవితల
పుస్తకావిష్కరణ
సిద్దిపేటకమాన్: తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన బందారం కథల పుస్తకావిష్కరణ మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్నట్లు మంజీర రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగాచారి తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సభకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి కవులు, సాహితీ వేత్తలు హాజరై విజయవంతం చేయా లని కోరారు. కార్యక్రమంలో యాదగిరి, భగవాన్‌రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికుల
దాహార్తి తీర్చేందుకు చర్యలు
చేర్యాల(సిద్దిపేట): వేసవి కాలం దృష్ట్యా బస్సులో ప్రయాణం చేస్తూ బస్టాండ్‌లో వేచి చూసే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు అన్నారు. సోమవారం స్థానిక బస్టాండ్‌లో రూ.80వేల ఖర్చుతో ఏర్పాటు చేసిన చల్లని నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సిబ్బంది ఉన్నారు.
జయంతి ఉత్సవాలు
ఘనంగా నిర్వహించాలి
బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి
సిద్దిపేటరూరల్: మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ బీసీ సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ మనుచౌదరికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ మహనీయుల జయంతి ఉత్సవాలు జరిపేందుకు బడ్జెట్లో కనీసం నిధులు కూడా నామమాత్రంగానే కేటాయిస్తున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడమే కానీ ఆచరణలో మాత్రం లేదన్నారు. తమతో కలెక్టర్ స్పందిస్తూ పూలే జయంతి నిర్వహణకు బడ్జెట్ లేదన్నారన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేస్తామని చెప్పినప్పటికీ కలెక్టర్ నామమాత్రంగా స్పందించారన్నారు. జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్‌గౌడ్ , జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బీసీ మహానీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో శ్రీహరియాదవ్, ప్రభాకర్‌వర్మ, నవీన్‌గౌడ్, మామిండ్ల ఐలయ్య, ప్రశాంత్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ
కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ
కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ


