
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మోదీ
బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రధాని మోదీ దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మొదట ఇద్దరు ఎంపీలతో మొదలైన పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి చరిత సృష్టించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంచంద్రరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.