
అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి
చేర్యాల(సిద్దిపేట): అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పద్మశ్రీ , ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం మండల పరిధిలోని శభాష్‌గూడెంలో అంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ కుల వ్యవస్థ కారణంగానే దేశంలో ఆర్థిక అసమానతలు ఏర్పడ్డాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశానికి ఉన్నత వర్గాల వారే ప్రధానులు అయ్యారని, ప్రస్తుతం మోదీ మాత్రమే బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చారన్నారు. రాజ్యంగంలో కల్పించిన హక్కులతోనే నేడు దళితులు రాజకీయంగా ఎదుగుతున్నారన్నారు. దళితుల ఉన్నతి కి పాటు పడిన మహనీయుల్లో జ్యోతిరావుపూలే, సావిత్రీబాయి పూలే, అంబేడ్కర్ ఉన్నారన్నారు.
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
జగదేవ్‌పూర్(గజ్వేల్): మహానీయుల అడుగు జాడల్లో నేటి యువత నడువాలని మందకృష్ణ మాదిగ కోరారు. కుకునూర్‌పల్లి మండలం చిన్నకిష్టాపూర్‌లో జైభీమ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం లేన్నందున మీ గ్రామానికి మరోసారి వస్తానని, ఇక్కడే నిద్ర చేసి అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాములు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
మంద కృష్ణమాదిగ
శభాష్ గూడెంలో విగ్రహావిష్కరణ