
చలివేంద్రాలతో ఎంతో మేలు
సిద్దిపేటకమాన్: ఎండల తీవ్రత పెరుగుతోందని, నిత్యం గ్రామాల నుంచి కేసుల నిమిత్తం కక్షిదారులు వస్తుంటారని వారి దాహార్తిని తీర్చడానికి చలి వేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని న్యాయమూర్తి బుధవారం ప్రారంభించారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవిలో మంచినీటిని ఎక్కువగా తాగాలని సూచించారు. న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, మిలింద్‌కాంబ్లి, చందన, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాటికొండ రమేష్‌బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు.