‘నెక్లెస్’ సుందరం.. నడక భయానకం
కోమటి చెరువు (నెక్లెస్ రోడ్డు)పై నడక భయానకంగా మారుతోంది. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్‌పై మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు అక్కడే మకాం వేస్తున్నారు. అంతేకాక తాగిన సీసాలను పగులగొట్టి విచ్చలవిడిగా పారేస్తున్నారు. రోజూ తెల్లవారుజామునే సుమారు 500 మందికిపైగా వాకర్స్ నెక్లెస్ రోడ్డుపై నడక సాగిస్తుంటారు. గాజు సీసాలను కొందరు గమనించక గాయాలపాలవుతున్నారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి మందుబాబులను కట్టడి చేయాలని వాకర్స్ కోరుతున్నారు. –సిద్దిపేటజోన్
‘నెక్లెస్’ సుందరం.. నడక భయానకం
‘నెక్లెస్’ సుందరం.. నడక భయానకం


