
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వివరాలు
8లో u
పంట నష్టానికి
పరిహారమేదీ?
అకాల వర్షాలతో వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
గజ్వేల్: అకాల వర్షాలతో రైతులు నష్టపోవడం సహజ పరిణామంగా మారుతోంది. ఈనెల 3న కురిసిన వర్షాలకు జిల్లాలోని వందలాది ఎకరాల్లో ప్రధాన పంటలకు నష్టం జరిగింది. అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదికలు పంపినా.. పరిహారం అందుతున్న దాఖలాలు కనిపించడం లేదు. కనీసం పంటల బీమా పథకం అమలై ఉంటే రైతులకు కొంత ఉపశమనం కలిగేది. కానీ ప్రభుత్వం నుంచి పరిహారం రాక, బీమా సౌకర్యం అమలుకు నోచుకోక రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి 3.52 లక్షల ఎకరాల్లో వరి, 22వేల ఎకరాల్లో మొక్కజొన్న, 11వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మరో 5వేల ఎకరాల్లో ఇంతర పంటలు సాగులోకి వచ్చాయి. పంటలు చేతికొచ్చే సమయంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వరి, మొక్కజొన్న పంటలకు వందలాది ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గంలో అకాల వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వర్షం ధాటికి గెలలు కట్టిన వరి నేలవాలి వడ్లు పూర్తిగా రాలిపోయాయి. చేతికందే దశలో మొక్కజొన్న పంట సైతం నేలవాలి కంకులు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఒక్కో రైతుకు లక్షల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది.
నివేదికలకే పరిమితం
అకాల వర్షాలు కురిసిన సందర్భంలో వ్యవసాయాధికారులు హడావిడిగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి ప్రభుత్వానికి నివేదికలు పంపడానికి పరిమితమవుతున్నారనే తప్పా.. పరిహారం మాత్రం అందటం లేదు. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటున్నది. ప్రస్తుతం కూడా పంట నష్టం అంచనా వేసే పనిలో ఉన్నామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
న్యూస్‌రీల్
బీమా లేక ఏటా తప్పని ఇబ్బందులు రైతన్నను నిండా ముంచిన వర్షాలు

ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025