నేత్రపర్వం.. శతఘటాభిషేకం
వర్గల్(గజ్వేల్): ఉగాది పర్వదినవేళ నాచగిరీశుని సన్నిధిలో అష్టాత్తర శతఘటాభిషేకం నేత్రపర్వం చేసింది. గర్భగుడిలో విశేషాలంకరణలో కొలువైన లక్ష్మీనృసింహుల దివ్యదర్శనంతో భక్తజనావళి తరించింది. పన్నెండు రోజులు ఆధ్యాత్మిక పరిమళాలు పంచిన బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఆలయ ముఖమండపంలో అర్చకులు 108 కలశాలు స్థాపన చేశారు. మహాపూర్ణ కలశంతో ఆలయ ప్రదక్షిణ జరిపారు. నృసింహ నామాలు, మంత్రోచ్ఛారణల మధ్య గర్భగుడిలో మూలవరులకు మహాభిషేకం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి హరిద్రలో పుణ్యస్నానాలాచరించారు. వేడుకలలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని తరించారు.
నేత్రపర్వం.. శతఘటాభిషేకం


