
పీసీసీ చీఫ్‌ను కలిసిన సూర్యవర్మ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆదివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసినట్లు జిల్లా ఆర్టీఏ (రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అఽథారిటీ) సభ్యు డు డాక్టర్ సూర్యవర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారన్నా రు. యువతకు ప్రతినెలా తప్పకుండా రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, పోలీసు వ్యవస్థకి ప్రజలకి వారధిలా ఉండాలని సూచించారన్నారు.
ట్రైకార్ రుణాలువిడుదల చేయండి
హుస్నాబాద్: బకాయి పడిన రూ.219 కోట్ల ట్రైకార్ రుణాలు వెంటనే విడుదల చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మాలోతు సత్యం నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత రాష్ట్ర ప్రభుత్వం ట్రైకార్ సంస్థ ద్వారా గిరిజన యువతి, యువకుల నుంచి వేలాదిగా దరఖాస్తులు స్వీకరించిందన్నారు. అందులో నుంచి కొంత మందికి రుణాలు మంజూరు చేస్తూ లబ్ధిదారులను గుర్తించిందన్నారు. వీరి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడానికి చెక్‌లను రెడీ చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపిందన్నారు. ప్రస్తుతం వీరందరూ రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కోసం కొత్తగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే రుణాలు తీసుకున్నట్లుగా చూపిస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న రుణాలను విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో గిరిజన సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తామని సత్యం నాయక్ హెచ్చరించారు. సమావేశంలో లంబాడి ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు భూక్యా కృష్ణ నాయక్, నాయకులు ఉన్నారు.
దుర్గమ్మా.. దండాలమ్మా
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున అమ్మవారిని పూజారులు పట్టువస్త్రాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

పీసీసీ చీఫ్‌ను కలిసిన సూర్యవర్మ

పీసీసీ చీఫ్‌ను కలిసిన సూర్యవర్మ