ఒత్తిడికి దూరంగా ఉండాలి
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి
గజ్వేల్: పదోతరగతి విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉండి పరీక్షలకు సిద్ధమైతేనే ఉత్తమ ఫలితాలు సాధించగలరని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండలంలోని బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంగ్లిష్ ల్యాబ్, లైబ్రరీని మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, రఫీక్, అర్జు న్, కవిత, ప్రసన్నలక్ష్మి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
గజ్వేల్‌రూరల్/కొండపాక(గజ్వేల్): జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల బాలుర, బాలికల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి విద్యార్థులు దరఖా స్తు చేసుకోవాలని జిల్లా డీసీఓ శివప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి 2025 ఆగస్టు 31 నాటికి 12యేళ్లలోపు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మరో రెండేళ్ల మినహాయింపు ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు రూ.లక్షా 50 వేలు, పట్టణ ప్రాంత విద్యార్థులు రూ.2 లక్షల ఆదాయ పరిమితి మించ కూడదని, ఆసక్తిగల విద్యార్థులు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 15 నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు https://mjptbewreir.teanfana.gov.inను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment