గజ్వేల్: మండల పరిధి బయ్యారం గ్రామానికి చెందిన మద్దూరి మల్లారెడ్డిని గజ్వేల్ ఆత్మ(అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ)కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఆయనతోపాటు మరో 24 మందిని డైరెక్టర్లుగా నియమించారు. ప్రభుత్వం తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించడంపై మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
నేటి నుంచి
రెండో విడత మూల్యాంకనం
సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ రెండో విడత జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలు, కేజీబీవీలలో భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రాల అధ్యాపకులను మూల్యాంకనం కోసం రిలీవ్ చేయాలన్నారు.
టాలెంట్ టెస్టులతో
మరింత ప్రతిభ
ఎంపీ రఘునందన్‌రావు
కొండపాక(గజ్వేల్): టాలెంట్ టెస్టులతో విద్యార్థుల్లో ప్రతిభ మరింత పెరుగుతుందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. కుకునూరుపల్లిలో ఎంపీ జన్మదినం పురస్కరించుకొని కుకునూరుపల్లిలో బీజేపీ, ఎంఆర్‌ఆర్ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం టాలెంట్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల కోసం కేంద్రం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మనోహర్, మండల అధ్యక్షుడు అనుముల సంపత్‌రెడ్డి, ఎంఆర్‌ఆర్ యువసేనా అధ్యక్షుడు సదానందగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
ఉగాది కవి సమ్మేళనం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో వంగర నరసింహారెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం కవులకు సురవరం ప్రతాపరెడ్డి స్మారక సాహిత్య పురస్కారాలు అందించారు.
దెబ్బతిన్న పంటలపై
ప్రభుత్వానికి నివేదిక
జిల్లా వ్యవసాయ అధికారి రాధిక
సిద్దిపేటఅర్బన్: ఈదురుగాలులతో కూడిన కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక అన్నారు. ఆదివారం అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో మొక్కజొన్న పంటను ఏఓ శ్రీనాథ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ప్రాథమిక అంచనా మేరకు ఒక్క ఎన్సాన్ పల్లిలోనే సుమారు 20 ఎకరాలలో మొక్కజొన్న పంట నేలకొరిగిందన్నారు. నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
పంటల పరిశీలన
సిద్దిపేటరూరల్: మండల వ్యవసాయాధికారి నరేశ్ దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించారు. శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ళ వర్షం పలు పంటలు దెబ్బతిన్నాయి. చింతమడక, సీతారాంపల్లి, ఆంకంపేట, మాచాపూర్, రాఘవాపూర్ గ్రామాల్లోని పంటలను క్షేత్రస్థాయిలో తిరుగుతూ పరిశీలించారు.
గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్‌గా మల్లారెడ్డి
గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్‌గా మల్లారెడ్డి