
కేతకీలో కర్ణాటక ఎమ్మెల్సీల పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంలో కర్ణాటక మాజీమంత్రి రాజశేఖర్ పాటిల్, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ పాటిల్, భీమ్‌రావు పాటిల్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఆలయానికి వచ్చిన వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాజీ మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, నాయకులు చంద్రశేఖర్ పాటిల్, మల్లయ్య స్వామి, రుద్రయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.