అదనపు పీపీగా ఆత్మారాములు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆత్మారాములును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆత్మారాములు విధులు నిర్వహించనున్నారు. ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆత్మారాములును కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎండీ రఫీయోద్దీన్, డీసీసీ లీగల్ సెల్ అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment