పది పరీక్షలు ప్రారంభం ● పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 79 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు మొదటి పేపరు తెలుగు–1ను రాశారు. తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థులను పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకురావడంతో అంతా సందడిగా మారింది. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 277 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 14,114 మందికి 14,101 మంది విద్యార్థులు హాజరయ్యారు. 13 మంది గైర్హాజరయ్యారు. 99.91శాతం హాజరు నమోదు అయ్యింది. కలెక్టర్ మనుచౌదరి పారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎస్‌ఆర్‌కే డీజీ స్కూల్, శ్రీచైతన్య పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, సీపీ అనురాధ, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అబ్జర్వర్ పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.
తొలిరోజు 99.91శాతం హాజరు
తొలిరోజు 99.91శాతం హాజరు
తొలిరోజు 99.91శాతం హాజరు