
మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ మెట్టుసాయి, ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ముదిరాజు రాష్ట్ర నాయకులు గీస భిక్షపతి, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.
పోషకాహారంతోనే ఆరోగ్యం
చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులు పోషక విలువలు ఉన్న ఆహార పదర్థాలను తినాలని.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ శారద అన్నారు. గురువారం ఇబ్రహీంనగర్ ఆదర్శ పాఠశాలలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషకాహార లోపం వల్లే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు మంచి పోషక విలువలు ఉన్న చిరుధాన్యాలను తీసుకోవాలన్నారు. రక్త హీనతకు గురి కాకుండా పల్లి పట్టీలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరీశుభ్రత, ఆరోగ్య సమస్యలపై వివరించారు. విద్యార్థినులకు రక్త పరీక్షలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు