
రథోత్సవం.. భక్తి పారవశ్యం
కొండపాక(గజ్వెల్): మండలంలోని కుకునూరుపల్లిలో వెలసిన సీతారామ చంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గరుడ సేవా రథోత్సం కనుల పండువగా సాగింది. ఆలయ కమిటీ చైర్మన్ పొల్కంపల్లి నరేందర్ సేన ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఘనంగా ఊరేగించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ సంకల్ప బలంతోనే రఽథోత్సవం విజయవంతంగా ముగిసిందన్నారు. మాజీ సర్పంచ్ ఐలం సహకారంతో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అమరేందర్, ఉప్పల రాజు, కొంతం రాజు, కనకయ్య, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కనుల పండువగా గరుడ సేవా రథోత్సవం