
కాళేశ్వరంతో గోదావరి పరవళ్లు
చిన్నకోడూరు(సిద్దిపేట): కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పల్లెల్లో గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారం రంగనాయక సాగర్ ప్రధాన కాల్వ నుంచి చిన్నకోడూరు బెల్లంకుంటకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్న కాంగ్రెస్ నేతలు చిన్నకోడూరుకు వచ్చి చూడాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్లే రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో కూడా గట్టిగా కొట్లాడుతాని.. ప్రజల కష్ట సుఖాల్లో అందుబాటులో ఉంటానని అన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసులకు భయపడను
సిద్దిపేటజోన్: నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో గళం ఎత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో పలువురి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేదిలేదన్నారు. సాగునీరు లేక దుబ్బాక, చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, కేసీఆర్ హయంలో రాష్ట్రం పురగమనంలో ఉంటే కాంగ్రెస్ పాలనలో తిరోగమనంలోఉందన్నారు. పెట్టుబడులు తగ్గి రాష్ట్ర పరిస్థితి అధ్వనంగా మారిందని విమర్శించారు.అంతకు ముందు బీఆర్‌ఎస్ సభ్యత్వం ఉండి ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు బీమా చెక్కులు అందజేశారు.
ఎమ్మెల్యే హరీష్‌రావు
Comments
Please login to add a commentAdd a comment