శిక్షణతో పాటు ఉపాధి కల్పించాలి
సిద్దిపేటరూరల్: జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు, ఉన్నత చదువులు చదువుకునే వారికి అన్ని రంగాల్లో నైపుణ్యాలు పొందేలా శిక్షణ కల్పించి, ఉపాధి పొందేలా అధికారులు చొరవ చూపాలనని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీఆర్‌డీఓ, పరిశ్రమల కేంద్రం, సెట్విన్, కార్మికశాఖ, ఉపాధి, పలు శిక్షణ శాఖల ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మాణ రంగం, టైలరింగ్, ఇందిరమ్మ ఇళ్ల కోసం మెసీ్త్రల ట్రైనింగ్, కూలీ ట్రైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వడం కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. వాటితో పాటుగా బ్యాంకింగ్, ఇతర రంగాల్లో ప్రతిభ చూపేలా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ తరగతులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ జయదేవ్‌ఆర్యా, డీఆర్‌ఓ, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ, డీఏఓ రాధిక, సెట్విన్ కోఆర్డినేటర్ అమీనాభాను, లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
Comments
Please login to add a commentAdd a comment