చెత్త.. నో చింత! | - | Sakshi
Sakshi News home page

చెత్త.. నో చింత!

Published Mon, Apr 7 2025 11:12 AM | Last Updated on Mon, Apr 7 2025 11:12 AM

చెత్త

చెత్త.. నో చింత!

తిలకించి.. పులకించి
రాములోరి కల్యాణంకమనీయం..
వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

ఎక్కడికక్కడే శుద్ధి

సిద్దిపేట బల్దియా వినూత్న ఆలోచన

స్వచ్ఛత లక్ష్యంగా అడుగులు

మరిన్ని కంపోస్టు యార్డులఏర్పాటుకు చర్యలు

స్మార్ట్‌ సిటీ లక్ష్యంగా సిద్దిపేట బల్దియా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది. చెత్త సేకరణ ప్రక్రియ సత్ఫలితాలు అందిస్తున్న క్రమంలో మరింత స్వచ్ఛత కోసం పారిశుద్ధ్య విభాగం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కడికక్కడే చెత్తను శుద్ధి చేసేందుకు సంకల్పించింది. వార్డుల్లో సేకరించిన తడి చెత్తను సుదూరంలో ఉన్న కంపోస్టు యార్డులకు తరలించడం పారిశుద్ధ్య విభాగానికి సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడి చెత్తను అక్కడే పునర్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నారు. పట్టణంలో పలుచోట్ల ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం అందించారు.

సిద్దిపేటజోన్‌: సిద్దిపేట పట్టణంలో రికార్డుల ప్రకారం ప్రతి రోజు 25మెట్రిక్‌ టన్నుల తడి చెత్త ఉత్పత్తి అవుతోంది. సేకరించిన తడి చెత్తను ప్రస్తుతం మందపల్లి, పశువుల ఆస్పత్రిలో, లింగారెడ్డిపల్లి, స్వచ్ఛబడిలోని ప్రాసెసింగ్‌ యూనిట్లకు తరలించి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. బల్దియాలో 43 వార్డులు ఉండడం, విలీన వార్డులు పట్టణానికి సరిహద్దుల్లో ఉన్న నేపథ్యంలో తడి చెత్త తరలింపు అంశం బల్దియాకు వ్యయ ప్రయసాలతో కూడుకుంటోంది. పారిశుద్ధ్య కార్మికుల మీద వత్తిడి పడకుండా అదనంగా కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మున్సిపాలిటీ గుర్తించింది. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ ఆశ్రిత్‌ కుమార్‌ అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు.

వేసవిలో మరో చిక్కు..

వేసవిలో పారిశుద్ధ్య విభాగానికి కొత్త చిక్కు ఏర్పడుతోంది. హరిత సిద్దిపేట దిశగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. దీంతో వేసవిలో ఎండు ఆకుల సమస్య ఏర్పడుతోంది. పెద్ద ఎత్తున రోజూ ఎండిన ఆకులను ట్రాక్టర్ల కొద్దీ సేకరించి కంపోస్టు యార్డులకు తరలించాల్సి వస్తోంది. తరలించిన ఎండు ఆకులను సేంద్రియ ఎరువుల తయారీలో వాడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎక్కడికక్కడే కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయడమే మేలని బల్దియా భావిస్తోంది.

రెండు లక్షల కిలోల విక్రయాలు..

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఇప్పటివరకు సుమారు రెండు లక్షల 30 వేల కిలోల సేంద్రియ ఎరువును విక్రయించారు. వర్మీ కంపోస్టు ఎరువు కిలో రూ.10కాగా, సెమి వర్మీ కంపోస్టు ధర 3 నుంచి 4 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీపై ఫోకస్‌ పెట్టడం విశేషం.

పార్కుల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు

మున్సిపాలిటీ పరిధిలోని పలు పార్కుల్లో తడి చెత్తను వర్మీ కంపోస్టుగా మార్చే ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా హౌసింగ్‌ బోర్డ్‌, మైత్రి వనం, నెహ్రు పార్కు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎర్ర చెరువు, కోమటి చెరువు, నర్సాపూర్‌ చెరువు ప్రాంతాల్లో పార్కుల్లో కంపోస్టు యార్డుల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అందుకు అవసరమైన ప్రక్రియ పనులను మున్సిపల్‌ అధికారులు వేగవంతం చేస్తున్నారు.

సౌలభ్యం కోసమే..

ఎక్కడి చెత్తను అక్కడే శుద్ధి చేసే ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. ఇప్పటికే 4చోట్ల యూనిట్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరిన్ని ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. – ఆశ్రిత్‌ మున్సిపల్‌ కమిషనర్‌

చెత్త.. నో చింత! 1
1/3

చెత్త.. నో చింత!

చెత్త.. నో చింత! 2
2/3

చెత్త.. నో చింత!

చెత్త.. నో చింత! 3
3/3

చెత్త.. నో చింత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement