
సన్‌ఫ్లవర్ రైతులను ఆదుకోండి
మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే హరీశ్ విజ్ఞప్తి
సిద్దిపేటజోన్: సిద్దిపేట నియోజకవర్గం సన్ ఫ్లవర్ రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే హరీశ్‌రావు శనివారం ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చిన్నకోడూరు మండల రైతుల సమస్యలను తెలుసుకున్న హరీశ్.. మంత్రికి ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. మండలంలోని రైతులు 18 వేల క్వింటాళ్ల దిగుబడి సన్ ఫ్లవర్ సాగు చేసినట్టు పేర్కొన్నారు. అందులో 5 వేల క్వింటాళ్లు పీఏసీఎస్ ద్వారా, మరో 2 వేల క్వింటాళ్లు మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపారు. మిగతా 11 వేల క్వింటాళ్ల సన్‌ఫ్లవర్ మిగిలిందని, దీనితో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీరాముడు చూపిన మార్గం అనుసరణీయం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆదర్శప్రాయుడు శ్రీరాముడు చూపిన మార్గం మనందరికీ అనుసరణీయమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. హక్కుల కంటే బాధ్యత గొప్పద న్నది రామతత్వం, కష్టంలో కలిసి నడవాల న్నది సీతాతత్వం అన్నారు. శ్రీరాముడు కష్టా ల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారన్నారు. మానవ అవతారమూర్తులైన సీతారాములు ధర్మసంస్థాపనకు నిలువుటద్దంగా నిలిచారన్నారు. శ్రీరాముని అనుగ్రహంతో అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాలన్నారు.