సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోండి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోండి

Published Tue, Mar 18 2025 9:07 AM | Last Updated on Tue, Mar 18 2025 9:03 AM

సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోండి

సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోండి

దుబ్బాక: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా మారాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సోమ వారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే దృష్టిసారించాలన్నారు. హాస్టళ్ల నిర్వహ ణ కొరవడటం.. నాణ్యమైన భోజనం అందడటంలేదన్నారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవాలన్నారు. హబ్షీపూర్‌ గురుకులంలో 7 వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నీలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారన్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా విషయం బయటకు రానివ్వడంలేదన్నారు. ఏ హాస్టల్‌కు వెళ్లినా ఫుడ్‌పాయిజన్‌, సిబ్బంది సక్రమంగా ఉండక సౌకర్యాలు సరిగ్గా లేక అవస్థలు పడుతున్నారన్నారు.

విద్యార్థులు ఆత్మహత్యలకు

పాల్పడుతున్నా పట్టించుకోవడంలేదు..

అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement