
మున్సిపల్ కమిషనర్‌కు ప్రశంసాపత్రం
సిద్దిపేటజోన్: మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ప్రశంసా పత్రం అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ (సీడీఎంఏ)శ్రీదేవి చేతుల మీదగా పత్రం అందుకున్నారు. 84.15శాతం పన్ను వసూలు చేసినందుకు గాను ప్రభుత్వం అభినందించి ప్రశంసా పత్రం అందజేసింది. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం సిబ్బంది, పట్టణ ప్రజల సహకారంతో మెరుగైన లక్ష్యం సాధించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
హుస్నాబాద్ కమిషనర్‌కు..
హుస్నాబాద్: మున్సిపాలిటీలో అత్యధికంగా ఇంటి పన్నులు వసూలు చేసినందుకు కమిషనర్ మల్లికార్జున్ సైతం ప్రశంసా పత్రం అందుకున్నారు. 2023–24 సంవత్సరానికి 76 శాతం ఇంటి పన్నులు వసూలు చేయడంతో కమిషనర్ ప్రశంసలు అందుకున్నారు.