
అందరికీ శుభాలు కలగాలి
హుస్నాబాద్: నూతన తెలుగు సంవత్సరాది నుంచి అందరికీ శుభాలు కలగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో మంత్రి పొన్నం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. షడ్రుచుల పచ్చడి, బక్ష్యాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మట్లాడుతూ సమృద్ధిగా పాడి పంటలతో అందరూ సుఖంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఆకుల రజిత, మాజీ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
మున్సిపల్ అభివృద్ధికి రూ.10 కోట్లు
మున్సిపల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు మంజూరైనట్లు సీడీఎంఏ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. చైతన్య పాఠశాల నుంచి పెట్రోల్ బంక్ వరకు సెంట్రల్ లైటింగ్ ప్లాంటేషన్ కోసం రూ.కోటి, మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజురయ్యాయి. అలాగే కొత్త చెరువు సుందరీకరణకు రూ.2కోట్లు, హుస్నాబాద్ మున్సిపల్ స్వాగత తోరణాల ఏర్పాటుకు రూ.1.20 కోట్లు మంజూరయ్యాయన్నారు. నూతన జంక్షన్ల అభివృద్ధి కోసం రూ.80 లక్షలు మంజూరయ్యాయి.
ప్లాస్టిక్‌ను నివారిద్దాం..
ప్లాస్టిక్‌ను నివారిద్దామని, స్టీల్ గ్లాస్‌లు మేలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం పట్టణంలోని హోటల్ యాజమానులకు స్టీల్ గ్లాస్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ గ్లాస్‌లో చాయ్ తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతామన్నారు. పట్టణంలో 50 హోటల్స్ ఉన్నాయని, ప్రతి హోటల్‌కు వంద గ్లాస్‌ల చొప్పున పంపిణీ చేశామన్నారు. చిన్న గ్రామాల్లో 500 కిట్స్, పెద్ద గ్రామాల్లో 1000 కిట్స్ చొప్పున స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తామన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు