
జూన్‌లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ
● ఆధునిక టెక్నాలజీతో నిర్మాణం ● ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
నంగునూరు(సిద్దిపేట): అత్యాధునిక టెక్నాలజీతో నంగునూరు మండలం నర్మేటలో నిర్మి స్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని జూన్‌లో ప్రారంభిస్తామని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు, ఎల్లాయిగూడ, రంగ నాయకసాగర్‌లోని ఆయిల్‌పామ్ నర్సరీల స్థితిగతులను, పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. సిద్దిపేట, జనగామ జిల్లాల వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో సాగు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని సందర్శించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తెచ్చిన ఆయిల్ గెలలను పరిశీలించి వారితో మాట్లాడారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న నిర్మా ణం పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుకు జనగామ, సిద్దిపేట జిల్లాలోని భూములు అనువుగా ఉన్నాయని, పెద్ద ఎత్తున సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. చిన్న, చిన్న పనులను పూర్తి చేసి జూన్ నాటికి ఫ్యాక్టరీని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, జనరల్ మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.