‘జిజ్ఞాస’లో భేష్
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల జిజ్ఞాస రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ స్థానాల్లో నిలిచి భేష్ అనిపించుకుంది. మైక్రోబయాలజీ విభాగం డా.మధన్‌మోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘టూత్‌బ్రష్‌ల పరిశుభ్రత’ ప్రాజెక్టుకు ప్రథమ, తెలుగు విభాగం డా.మట్ట సంపత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘వరకవిసిద్ధప్ప’ ప్రాజెక్టుకు, ఆంగ్ల విభాగం బాలకిషన్ ఆధ్వర్యంలో చేసిన పరిశోధన ‘కృత్రి మ మేధస్సు పాత్ర’కు ద్వితీయ బహుమతులు లభించాయి. వాటితో పాటు చరిత్ర విభాగంలో డాక్టర్ కొండల్‌రెడ్డి పర్యవేక్షణలో హస్తకళలు–గొల్లభామచీరలు అనే పరిశోధనకు తృతీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా బుధవారం ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, సీఈఓ డా.గోపాలసుదర్శనం, డా.మధుసూదన్, డా.ఉమామహేశ్వరి, పిట్లదాసు, డా.శ్రద్ధానందం తదితరులు విద్యార్థులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment