
పర్యాటక కేంద్రంగా మహాసముద్రం
● రూ.10 కోట్లతో ప్రతిపాదనలు ● మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
హుస్నాబాద్‌రూరల్: డివిజన్ కేంద్రానికి సమీపంలోని మహాసముద్రంను పర్యాటక కేంద్రంగా సుందరీకరణ చేస్తున్నామని, ఇందుకు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం ఉమ్మాపూర్‌లోని మహాసముద్రాన్ని పరిశీలించి, అభివృద్ధి పనులపై స్థానిక నాయకులతో చర్చించారు. నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తామన్నారు. పోతారం(ఎస్) జాతీయ రహదారి నుంచి బైరోని చెరువు, మహాసముద్రం వరకు రోడ్డు నిర్మాణం చేసి పర్యటక కేంద్రానికి కావల్సిన పనులను పూర్తి చేయడానికి పర్యటక శాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి పొరుగు జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ చందు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment