మండుటెండలో వరుస కట్టి.. బడిబాట పట్టి
మండుతున్న ఎండల నేపథ్యంలో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. విద్యార్థులు తప్పని పరిస్థితుల్లో మిట్ట మధ్యాహ్నం వేళ ఎండలోనే బడికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మిరుదొడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం టెన్త్ పరీక్షలు జరుగుతుండటంతో మిగతా తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం వేళ పాఠాలను బోధిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ, బీసీ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు మండుటెండలో వరుసకట్టి బడికి వెళ్తుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.
– మిరుదొడ్డి(దుబ్బాక)
మండుటెండలో బడికి వెళ్తున్న విద్యార్థులు