
విగ్రహం తొలగించడం సరికాదు
సిద్దిపేటకమాన్: ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇది సరికాదని అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవిలయ్య అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నంగునూరు మండలం ముండ్రాయి గ్రామంలో 16ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న విగ్రహాన్ని తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఐదు గ్రామాలకు కూడలి వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించకుండా అక్కడ ఒక సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బాబురావు, యాదగిరి, రాజు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.