
బందారం కథలలో తెలంగాణ జీవితం
సిద్దిపేటకమాన్: బందారం కథలలో తెలంగాణ జీవితం ఉన్నదని సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన సిద్దారెడ్డి ‘బందారం కథలు’ పుస్తకావిష్కరణ సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కథలు వస్తే పల్లె బతుకుల గుండె ఆవిష్కరణ అవుతుందన్నారు. సిదారెడ్డి పీడిత పక్షపాతి అన్నారు. సాహిత్యంలో మానవీయ సంబంధాలు ఉండాలని అన్నారు. ఈ పుస్తకం ద్వారా సాహిత్య చరిత్రలో బందారం గ్రామం నిలబడుతుందన్నారు. సభలో సిద్దారెడ్డి, మరసం అధ్యక్షుడు రంగాచారి, ప్రముఖ కవులు పొన్నాల బాలయ్య, అంజయ్య, యాదగిరి, పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.
మల్లన్న ఆలయ
ఉద్యోగిపై కేసు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో ప్లంబర్‌గా విధులు నిర్వహిస్తున్న సార్ల విజయ్‌కుమార్‌పై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజుగౌడ్ తెలిపారు. గత నెల 26న ఆలయంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆరెళ్ల మహేష్, ప్లంబర్ విజయ్‌కుమార్ గొడపడ్డారు. దీంతో సార్ల విజయ్‌కుమార్ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహేష్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై తనకు అన్యాయం జరిగిందంటూ.. ముందుగా విజయ్‌కుమార్ తనపై దాడి చేశారని పోలీసు ఉన్నతాధికారులకు విన్నపించారు. విషయాన్ని విచారించిన పోలీసులు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు.ఈ విషయం కొమురవెల్లిలో చర్చనీయాంశగా మారింది.