గరిమా టీచర్ !
టెన్త్ విద్యార్థులకు 45 నిమిషాల పాటు బోధన
దుబ్బాక: నిత్యం ఎన్నో పనుల ఒత్తిడితో ఉంటే అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ లెక్కల టీచర్‌గా మారారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 45 నిమిషాల పాటు పదోతరగతి విద్యార్థులకు గణితం, ఫిజిక్స్‌కు సంబంధించిన అంశాల గురించి బోధించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం పరిసరాలు, భోజనశాలను పరిశీలించారు. అన్నం మెత్తగా ఉండడంతో వెంటనే సివిల్ సప్లయ్ డీఎంకు ఫోన్‌చేసి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఎంపీడీఓ భాస్కరశర్మ, ఎంఈఓ ప్రభుదాసు తదితరులు ఉన్నారు.
శతశాతం సాధించాలి
సిద్దిపేటరూరల్: బ్యాంకర్లకు వివిధ సెక్టార్లో ఇచ్చిన లక్ష్యాలను శతశాతం సాధించేలా బ్యాంకర్లు, అధికారులు సమష్టి కృషితో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో బ్యాంకర్లు, పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ పథకాలు, కార్యక్రమాల అమలులో నిర్ధేశించిన లక్ష్యాలను అమలు చేయాలన్నారు. జిల్లాలో మంజూరైన రుణాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు. లక్ష్య సాధనలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం నాబార్డు జారీ చేసిన పొటెన్షియల్ లింకేజీ ప్లాన్ 2025–26 ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం హరిబాబు, డీఆర్‌డీఓ జయదేవ్‌ఆర్యా, నాబార్డ్ డీడీఎం నిఖిల్, యుడీఐ ఆర్‌ఎం వికాస్ తదితరులు పాల్గొన్నారు.
ఓటుహక్కు నమోదు చేసుకోండి
18యేళ్లు నిండిన వారంతా ఓటుహక్కును నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. దుబ్బాక ఐఓసీ కార్యాలయంలో వివిధ రాజకీయపార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటుహక్కు నమోదుకు నాయకులు సహకరించాలన్నారు. తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఆర్‌ఐ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment