బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్
గజ్వేల్: మాజీ సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండటం లేదని, సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో బీజేపీ గజ్వేల్ నాయకులు బుధవారం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటుకు ‘వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే, టు–లెట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్’ పోస్టర్లను అతికించారు. అనంతరం అక్కడే బైఠాయించి ‘గుర్తున్నారా సారూ–గజ్వేల్ ప్రజలు’, ‘కేసీఆర్ రాజీనామా చేయాలి’ అనే నినాదాలతో ఫ్లకార్డులు పట్టుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ సైదా అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. బీజేపీ నేతలు జశ్వంత్‌రెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు
గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ నేతలపై బీఆర్‌ఎస్ నాయకులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడిచేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ కృషి వల్లే గజ్వేల్ అభివృద్ధిలో యాభై యేళ్లు ముందుకు వెళ్లిందన్నారు. మెదక్ ఎంపీ రఘనందన్‌రావు గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఒక్క అభివృద్ధి పనైనాని చేయగలిగారా?, సోయి లేకుండా క్యాంపు కార్యాలయంపై దాడి చేస్తారా? అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం గజ్వేల్ అభివృద్ధికి ఏమీ చేయలేదని వాపోయారు.
పాదయాత్ర చేస్తాం: డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
కాంగ్రెస్ నాయకులు గురువారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేస్తామని, అనంతరం హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించి +రాజ్‌భవన్‌లో కూడా వినతి పత్రం అందజేస్తామని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు.
కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడి
పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్ ఫిర్యాదు
వేడెక్కిన గజ్వేల్ రాజకీయం
బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్
Comments
Please login to add a commentAdd a comment