
దుండగులను శిక్షించాల్సిందే
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై కాల్పులు జరిపిన వారిని శిక్షించాల్సిందేనని డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జాతీయ కార్యదిర్శి పి. శంకర్ డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించడంలో పాలకుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఈ నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించే ‘ప్రశ్నించే గొంతులు–అణచివేత’లపై నిరసన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని లింగుపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం గద్దర్ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దర్‌పై కాల్పులు జరిపిన వారిని శిక్షించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వమైనా దుండగులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం నాయకులు జోగ్గారి బాల్ నర్సు, నర్సింహులు, మహేష్, రాజు, భిక్షపతి, బాలరాజు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.